Bandh in Basara : జ్ఞానసరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను స్థానికులు, విద్యార్థులు, అర్చకులు ఖండించారు. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌ను అరెస్టు చేయాలంటూ తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరలో ఆందోళన చేపట్టారు. వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. స్థానికులు, వ్యాపారస్థులు, విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు, సిబ్బంది సేవలను నిలిపివేసి నిరసన తెలిపారు. రాజేశ్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. నిజామాబాద్-భైంసా రహదారిపై రాస్తారోకోకు దిగడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బాసర బంద్ - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
Bandh in Basara : తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞానసరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేశ్‌ని అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు, సిబ్బంది సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. వ్యాపారులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.
Bandh in Basara