ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్

By

Published : Dec 8, 2020, 11:25 AM IST

Updated : Dec 8, 2020, 8:13 PM IST

నెల్లూరు జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ముందస్తు ప్రకటనతో వ్యాపార సంఘాలు, విద్యా సంస్థలు మూసివేశారు. ఆటోలు, లారీలు కూడా తిరగలేదు. జిల్లాలో 10ఆర్టీసీ డిపోల్లో 840బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బంద్​కు కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారులపై నిత్యావసర సరుకులు వెళ్లే వాహనాలు తప్ప మిగతా వాహనాలు వెళ్లలేదు.

bandh in nellore
నెల్లూరు జిల్లాలో భారత్ బంద్

నెల్లూరు జిల్లాలో భారత్ బంద్

నెల్లూరు జిల్లావ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. తెల్లవారుజాము నుంచే రైతు సంఘాలతో కలిసి వివిధ పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని... అన్నదాతలకు మద్దతుగా నినాదాలు చేశారు. నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి,ఆత్మకూరు , ఉదయగిరి పట్టణాల్లో బంద్ విజయవంతమైంది.

లారీ యజమానులు వాహనాల తిప్పకుండా స్వచ్ఛంగా బంద్ పాటించారు. వ్యాపార సంస్థలన్నీ కర్షకులకు మద్దతుగా నిలిచారు. బంద్ కారణంగా ... అధికారులు బస్సులను డిపోకు పరిమితం చేశారు. కేంద్రం రైతుల శ్రేయస్సు విస్మరిస్తోందని...వెంటనే నూతన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్​ చేశారు.

నెల్లూరులోని అయ్యప్ప గుడి సెంటర్‌ వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై ధర్నా చేయడం వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆత్మకూరులోని పలు మండలాల్లో..

ఆత్మకూరులో

ఆత్మకూరు డివిజన్లోని పలు మండలాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు రోడ్డుపై చేరుకుని రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీల కార్యకర్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. భారత్ బంద్​కు సంఘీభావంగా ఆత్మకూరు పట్టణంలోని వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. వామపక్ష రైతు సంఘాల ఐక్యవేదిక భారీ ర్యాలీ నిర్వహించి, గాంధీబొమ్మ సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

భారత్ బంద్ ప్రభావంతో ఉదయగిరి ఆర్టీసీ డిపోలో 40 బస్సులు నిలిచిపోయాయి. ముందుగానే తెలియడంతో ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్ వెలవెలబోతూ దర్శనమిచ్చింది. ఉదయగిరిలో రైతు సంఘం ఆధ్వర్యంలో దుకాణాలను మూసివేయించారు.

నెల్లూరు జిల్లాలో భారత్ బంద్

నాయుడుపేట కూడలి ఆర్టీసీ బస్టాండ్ బోసి పోయింది. ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు తగ్గాయి. పనుల నిమిత్తం వచ్చిన పేదలు ప్రభుత్వ కార్యాలయాలు వద్ద వేచి ఉన్నారు. సీఐటీయూ, యూటీఎఫ్ , ఎల్ఐసీ పలు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మలుపు రోడ్డుపై నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు మద్ధతుగా నిలబడతామని సంఘీభావం ప్రకటించారు. రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండీ...అనంతపురంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

Last Updated : Dec 8, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details