ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండెపోటుతో బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు మనోహరం మృతి

బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తోట మనోహరం గుండెపోటుతో హైదరాబాద్​లో మృతి చెందారు. షిరిడీ వెళ్లి వస్తుండగా.. హైదరాబాద్​ రైల్వే ష్టేషన్​లో గుండెపోటుతో కుప్పకూలారు.

Ball Badminton Association President Manohar dies
బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు మనోహరం మృతి

By

Published : Aug 22, 2021, 9:19 AM IST

బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తోట మనోహరం(66) శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. షిరిడీ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో హైదరాబాద్‌ రైల్వే స్టేషన్​లో గుండెపోటుతో కుప్పకూలారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరుకు చెందిన మనోహరం అక్కడే ఏసీ సుబ్బారెడ్డి రీడింగ్‌ రూమ్‌ యూత్‌ సెంటర్​ ఏర్పాటుచేసి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారు.

ఎంతో మందిని బాల్‌బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబడ్డీ తదితర క్రీడల్లో జాతీయస్థాయికి తీసుకెళ్లారు. తోట శంకరమ్మ మహిళా సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కుట్టులో శిక్షణ ఇచ్చారు. మహిళా గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details