balakrishna fans celebrations: తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో "అఖండ" సింహగర్జన కొనసాగుతుండగా.. థియేటర్ల బయట అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న సినిమా కావడం.. బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన మూడో చిత్రం కావడంతో.. అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో.. ఈ చిత్రాన్ని మొదటి రోజే చూసేయాలని ఫ్యాన్స్ సినిమా టాకీసులకు పోటెత్తారు. ఫలితంగా.. థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది.
బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. సినిమా హాల్ వద్ద ఆమె కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులకు పంపిణీ చేశారు. బాలకృష్ణ అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే "అఖండ" సినిమా వీక్షించారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.