నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పేరుతో వదిలి వెళ్లిన బాబును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. చికిత్స కోసం 4 నెలల క్రితం ఓ మహిళ ఈ బాబును ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె తిరిగి రాకపోవటంతో బాబుకు అన్నీ తామై వైద్య సిబ్బంది సేవ చేస్తున్నారు. ఈ విషయంపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాబు కోలుకోవటంతో వైద్యాధికారులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించనున్నారు. ఇటీవల అపహరణకు గురై దొరికిన ఓ పాపను, చికిత్స పొందుతూ తల్లి మృతి చెందిన మరో పాపను... వారి కుటుంబ సభ్యులకు వైద్యాధికారులు అప్పగించారు.
ఐసీడీఎస్ చెంతకు.. ఆస్పత్రిలో బాబు! - icds
చికిత్స కోసం వచ్చి నెల్లూరు ఆసుపత్రిలో వదిలి వెళ్లిన బాబును... వైద్యాధికారులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించనున్నారు. వేర్వేరు ఘటనల్లో ఆసుపత్రిలో ఉన్న మరో ఇద్దరు పాపలను వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు.
'ఐసీడీఎస్ కు ఆసుపత్రిలో వదిలి వెళ్లిన బాబు'
ఇవీ చూడండి- ఇక నుంచి ఆ నలుగురు భాజపా పెద్దలు