బర్డ్ ఫ్లూ నమూనా సేకరణపై అవగాహన సదస్సు - నెల్లూరు తాజా న్యూస్
నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలో పశు వైద్య, అటవీ శాఖ అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలపై సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలను అధికారులు గుర్తించారు.
బర్డ్ ఫ్లూ నమూనా సేకరణ పై అవగాహన సదస్సు
నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలను వైద్యులు గుర్తించారు. వీటి లక్షణాలు, నమూనా సేకరణపై.. పశు వైద్య, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ రవీంద్రనాథ రెడ్డి పాల్గొన్నారు.