ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మకూరులో కరోనాపై అవగాహన ర్యాలీ - తాజాగా నెల్లూరులో కరోనా పై అవగాహన ర్యాలీ

ఆత్మకూరు మున్సిపాలిటీలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని నినాదాలు చేశారు. ప్రజలందరూ కరోనా మహమ్మారి పై అవగాహనతో ఉంటూ... తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీవో సువర్ణమ్మ అన్నారు.

Awareness rally on corona
ఆత్మకూరులో కరోనా పై అవగాహన ర్యాలీ

By

Published : Oct 21, 2020, 4:42 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో కరోనాపై అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వారం రోజుల పాటు ప్రజలకు కొవిడ్ పై అవగాహన కలిగించే కార్యక్రమాలకు నాంది పలికింది. ఇందులో భాగంగా తొలిరోజు అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నినాదాలు చేశారు.

ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారి పై అవగాహనతో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీవో సువర్ణమ్మ అన్నారు. తమతో పాటు చుట్టుపక్కల ప్రజల్ని కూడా ఆరోగ్యంగా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, మెప్మా సిబ్బంది , ఆశా వర్కర్లు , వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details