నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు... ప్రజలు పాటించాల్సిన తీరుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ రవీంద్ర బాబు, ఎస్సై అన్వర్ బాషా ఆధ్వర్యంలో పురపాలక, వైద్య, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాశీపేట నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా క్రాస్ రోడ్ కూడలి వరకు భౌతిక దూరం పాటిస్తూ ర్యాలీ చేపట్టారు. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆటోలో ప్రచారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పరిశుభ్రంగా ఉండండి.. భౌతిక దూరం పాటించండి - నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కరోనా వ్యాప్తిపై అవగాహన ర్యాలీ
కరోనా నియంత్రణపై నెల్లూరు జిల్లాలో పారిశుద్ధ్య, వైద్య, వివిధ శాఖల ఉద్యోగులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి కరోనాను కట్టడి చేయాలని సూచించారు.
![పరిశుభ్రంగా ఉండండి.. భౌతిక దూరం పాటించండి awareness rally on corona prevention at nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6746701-217-6746701-1586580287665.jpg)
నెల్లూరులో కరోనా నియంత్రణపై అవగాహన ర్యాలీ