ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముంతమామిడిలో బీపీటీ8 రకం సాగు మేలు' - nellore krishi vignana kendram news

భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రీయ సమావేశం నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. నూతన పంటల విధానాలపై శాస్త్రవేత్తలు.. రైతులకు అవగాహన కల్పించారు.

krishi vignana kendram
నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు అవగాహాన కార్యక్రమం

By

Published : Feb 18, 2021, 8:05 PM IST

నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రీయ సలహా సమావేశం జరిగింది. వ్యవసాయ అనుబంధ శాఖల శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు.. నూతన పంటల విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ఉద్యాన పంటలైన మామిడిలో బంగినపల్లి, పునాస రకాలు ఎంతో మేలు రకాలని తెలిపారు. వరిలో NLR 34449 రకం వేసుకోవాలని రైతులకు సూచించారు. ముంతమామిడిలో బీపీటీ8 రకం సాగు చేస్తే బాగుంటుందని రైతులకు తెలియజెప్పారు. చేపలు , రొయ్యలు, పశువుల పెంపకంపై సందేహాలను నివృత్తి చేశారు. పంటలో వచ్చే తెగుళ్లపై అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details