ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీలకు పోటీ..అభివృద్ధి ఆధారంగా అవార్డులు - latest updates of phanchayath

పంచాయతీల పోటీ మొదలైంది. ఇన్ని రోజులు పడిన శ్రమకు ఫలితం లభించనుంది. జరిగిన మార్పు, చేసిన అభివృద్ధిని గుర్తించి ప్రభుత్వం సత్కరించనుంది. ఈ పోటీకి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక వెబ్‌సెట్‌ను కేటాయించింది.

awards for phanchayaths
పంచాయతీల పోటీ

By

Published : Oct 7, 2020, 1:59 PM IST

అవార్డుల పరుగుకు వేళైంది.. పంచాయతీల మధ్య పోటీ మొదలైంది.. పడిన కష్టం.. చేసిన మార్పులు, సాధించిన అభివృద్ధికి పట్టం కట్టే తరుణం రానే వచ్చింది. పంచాయతీలు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం నుంచి ఆశాఖ జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. వీటిని అన్ని పంచాయతీలకు పంపేలా జిల్లా పంచాయతీ అధికారి ఎం.ధనలక్ష్మి చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 944 పంచాయతీలున్నాయి. వీటి అభివృద్ధి, నిర్ణయించిన నియమాల ప్రకారం పోటీ ఉంటుంది. ఇతర అధికారుల సహకారంతో పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను కార్యదర్శులు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు పంపాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సెట్‌ను కేటాయించింది.

అవార్డుల పోటీకి నవంబరు 10వ తేదీ వరకు గడువు ఉంది. ఈలోగా అన్ని అంశాలతో నివేదికలను తయారు చేసి జిల్లా అధికారుల అనుమతితో గ్రామ పంచాయతీలు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఎంపికైన గ్రామ పంచాయతీ అధికారులకు ప్రత్యేక గుర్తింపు, సత్కారం, నగదు బహుమతిని ప్రభుత్వం అందించనుంది.

ఇదీ చదవండీ...సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ పోరు

ABOUT THE AUTHOR

...view details