ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక ఆటోడ్రైవర్ ఆత్మహత్య - nellore crime news

ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రజాప్రతినిధులు మారుతున్నారు. కాని పేదల బతుకులు మాత్రం మారడంలేదు. ఎన్ని బాధలున్నా తమ రెక్కల కష్టాన్నే నమ్ముకున్న పేదలను అప్పుల బాధ కబళిస్తోంది. సంగం మండలం జండాదిబ్బ గ్రామంలో‌ ఫణికుమార్ అనే వ్యక్తి అప్పుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు.

Auto Driver Suicide with debts
అప్పుల బాధ తాళలేక ఆటోడ్రైవర్ ఆత్మహత్య

By

Published : Sep 23, 2020, 10:32 PM IST

నెల్లూరు జిల్లా సంగం మండలం జండాదిబ్బ గ్రామంలో అప్పుల బాధతో ఉరివేసుకొని‌ ఫణికుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బ్రాందిషాపులో ఖాళీ మద్యం బాటిళ్లు సేకరించి.. వచ్చిన నగదుతో జీవితం కొనసాగించేవారు. ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారం కూడా లేకుండా పోయింది. బతుకుదెరువు కోసం ఓ ఆటోను కొన్నాడు. కరోనా లాక్​డౌన్ కారణంగా అదీ నడవలేదు. అప్పుల భారం పెరిగింది. కుటుంబ పోషణ కష్డంగా మారింది. తెచ్చిన అప్పులు తీర్చలేక... కుటుంబాన్ని పోషించే దారి కనిపించక ఇంట్లోని బాత్​రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు‌. మృతినికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details