నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీ హజరత్ సుల్తాన్ షాహిద్ దర్గా పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వైకాపా మైనార్టీ నాయకుల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దర్గా కమిటీ చైర్మన్లుగా గఫార్ సాహెబ్, బషీర్ ,గోరి సుల్తాన్ సా, మునాఫ్, హయాత్ భాష దర్గా అభివృద్ధి కోసం వారి వారి స్థాయిలో పనిచేసి సుల్తాన్ షహీద్ స్వామి భక్తుల మన్ననలు పొందారు. గత రెండు సంవత్సరాల నుంచి దర్గా ఈద్గా మసీదు వక్ఫ్ బోర్డు పరిరక్షణలోకి వెళ్లడంతో పూర్తి బాధ్యతలు జిల్లా వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. దర్గా రూమ్ ల ద్వారా కానుకల రూపంలో ప్రతి నెల లక్ష రూపాయలకు పైగా రాబడి సమకూరుతుంది. దర్గా మసీదు పరిశుభ్రత బాధ్యతలు సన్నగిల్లాయి. కనీస అవసరాలైన బ్లీచింగ్, ఫినాయల్, చీపురు వంటి అత్యవసర ఖర్చులకు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ డబ్బులు కేటాయించడం లేదని వైకాపా నాయకులు అన్నారు. గత 15 నెలలుగా వక్స్ బోర్డు ఇన్స్పెక్టర్ ఒక్కసారి కూడా రాలేదని అన్నారు. దర్గా పరిరక్షణ బాధ్యతలు పట్టించుకోని వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ పనితీరుపట్ల జిల్లా కలెక్టర్ , మంత్రి మేకపాటి గౌతం రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లనున్నట్లు తెలిపారు.
ఆత్మకూరులోని దర్గా అభివృద్ధిని పట్టించుకోని అధికారులు. - ఆత్మకూరులోని దర్గా
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీ హజరత్ సుల్తాన్ షాహిద్ దర్గా పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వైకాపా మైనార్టీ నాయకుల ఆవేదన వ్యక్తం చేశారు.. కనీస అవసరాలైన బ్లీచింగ్, ఫినాయల్, చీపురు వంటి అత్యవసర సామగ్రి కొనుగోలుకు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ డబ్బులు కేటాయించడం లేదని వైకాపా నాయకులు అన్నారు

ఆత్మకూరులోని దర్గా అభివృద్ధిని పట్టించుకోని అధికారులు.
ఇదీ చూడండి.ఇంటర్ పాఠ్యాంశాలు.. 30 శాతం తగ్గింపు