నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ తెదేపా బీసీ సెల్ నేత వెంకటేశ్వర్లు ఇల్లు కూల్చివేత ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామంలో ముందు దుకాణాలు, వెనుక ఇల్లు, దుకాణాలు నిర్మించుకుని వెంకటేశ్వర్లు కుటుంబం నివాసముంటోంది. ప్రస్తుతం ఆ దుకాణాలు ఆర్అండ్బీ స్థలంలో ఉన్నాయంటూ, కూల్చేందుకు అధికారుల ప్రయత్నించగా వెంకటేశ్వర్లు వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కూల్చివేతను అడ్డుకోవడంతో పోలీసులు వారిని బలవంతంగా పక్కకు లాగేసి, జేసీబీతో దుకాణాలను నేలమట్టం చేశారు.
కోవూరులో ఉద్రిక్తత... తెదేపా నేత ఇల్లు, దుకాణాలు కూల్చివేత - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
కోవూరు నియోజకవర్గ తెదేపా బీసీ సెల్ నేత వెంకటేశ్వర్లు ఇల్లు కూల్చివేత ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఇల్లు కూల్చివేయటంపై తెదేపా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని పక్కకు లాగేసి దుకాణాలను నేలమట్టం చేశారు.
దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు గ్రామానికి చేరుకుని అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు 1970వ సంవత్సరంలో ఇల్లు నిర్మించుకుని అప్పటి నుంచి ఉంటుంటే, స్థానిక ఎమ్మెల్యే కక్షపూరితంగా అధికారులతో దుకాణాలు పడగొట్టించారని తేదేపా నాయకులు ఆరోపించారు. గ్రామంలో అనేక ఇల్లు దుకాణాలు ఆర్అండ్బీ స్థలంలోనే ఉన్నా వాటి జోలికి వెళ్లని అధికారులు, మూడు సార్లు సర్పంచిగా సేవలందించిన వెంకటేశ్వర్లు దుకాణాలు కూల్చివేయడం దుర్మార్గమని వారు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురిచేందుకు వారి ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: