Attacks on meat sales: నెల్లూరు జిల్లాలో మాంసం విక్రయాలపై జిల్లా వైద్యశాఖ, నగర వైద్యాధికారి జాయింట్‌గా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిల్వ ఉన్న, నాసిరకం మాసం విక్రయాలు బయటపడ్డాయి. చెన్నై నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న 300 కేజీల కోడి లివర్‌ను అధికారులు పరిశీలించి సీజ్ చేశారు. ఆరిఫ్ అనే వ్యాపారి కుళ్లిన కోడి మాంసం దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి మాంసం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కుళ్లిన కోడి మాంసంతో పాటు మరో 400 కేజీల నాసిరకం మాంసాన్ని సీజ్ చేశారు అధికారులు.
నెల్లూరులో మాంసం విక్రయాలపై అధికారుల దాడులు.. 400 కేజీల మాంసం సీజ్ - ap latest news
Attacks on meat sales: నెల్లూరు నగరంలో వైద్యాధికారులు మాంసం విక్రయాలపై దాడులు నిర్వహించారు. దాడులలో కుళ్లిన మాంసం విక్రయాలు బయటపడ్డాయి. కుళ్లిపోయిన నాసిరకం మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు.
మాంసం విక్రయాల పై దాడులు