నెల్లూరు నగరం మైపాడు రోడ్డులో.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న జంతు వధశాలలపై కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. దుర్వాసన వస్తోందని... స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తనిఖీలు చేశారు.
ఓ గదిలో నిల్వ ఉంచిన ఆవు మాంసాన్ని, జంతు కళేబరాలను అధికారులు సీజ్ చేశారు. ఇకపై జంతు కళేబరాలను నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. గతంలోనూ ఈ ప్రాంతాల్లో కార్పొరేషన్ అధికారులు దాడులు చేసినా వ్యాపారుల్లో మార్పు రాలేదు.