నాటుసార కాస్తున్నారన్న సమాచారం పోలీసులకు తెలిపిందన్న కోపంతో మహిళా వాలంటీర్ ఇంటికి వచ్చిన ప్రత్యర్ధులు దాడికి దిగారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్.పేట మండలం గుడిపాడు గ్రామంలో జరిగింది. ఎస్సీ కాలనీలో గతంలో నాటు సార తయారు చేసి విక్రయిస్తుండగా స్థానిక మహిళా వాలంటీర్ ప్రేమలత పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించారు. అప్పటినుంచి కక్ష పెంచుకున్న ప్రత్యర్ధులు తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. ఇంటికి వచ్చి దాడి చేశారని, ఇల్లు ధ్వంచం చేశారని, అడ్జుకునేందుకు వచ్చిన తన భర్తతో పాటు నలుగురు స్థానిక మహిళలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని బాధితురాలు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా వాలంటీర్‌పై దాడి... ఇంటిని ధ్వంసం చేసిన ప్రత్యర్ధులు - నెల్లూరు ఏ.యస్ పేటలో మహిళా వాలంటీర్‌పై దాడి
నాటుసార కాస్తున్నారన్న సమాచారం... పోలీసులకు తెలిపిందన్న కోపంతో మహిళా వాలంటీర్ ఇంటి పై ప్రత్యర్ధులు దాడికి దిగారు. వాలంటీర్ కుటుంబసభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్.పేట మండలం గుడిపాడు గ్రామంలో జరిగింది.
మహిళా వాలంటీర్‌పై దాడి