ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానంతో దాడి... ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం - reddy vari kandrika updates

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిపై దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకున్న యువకుడి మామపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

attack
అనుమానంతో దాడి

By

Published : Apr 23, 2021, 7:09 PM IST

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం రెడ్డి వారి కండ్రిక గ్రామంలో దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో నరేష్​ అనే యువకుడిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని మేనమామ చిలకపాటి మల్లికార్జునపై సైతం దాడికి పాల్పడ్డారు.

క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మల్లికార్జున మృతి చెందాడు. నరేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

దుండగుల దాడిలో ఒకరు మృతి, మరొకరికి గాయలు

పిల్లలతో పాటు నిప్పంటించుకున్న తల్లి..ఇద్దరు మృతి, కుమారుడు క్షేమం

ABOUT THE AUTHOR

...view details