పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ జరుగుతుండగా.. యువతిపై కత్తితో దాడి - నెల్లూరు జిల్లా నేర వార్తలు
14:01 January 11
నెల్లూరు జిల్లా కోవూరు పీఎస్‌లో అమ్మాయిపై కుటుంబ సభ్యుల దాడి
Attack on Lady in Kovur Police Station: నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో యువతిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. ప్రేమ వివాహం నేపథ్యంలో స్టేషన్లో కౌన్సిలింగ్ జరుగుతుండగా.. యువతి అన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే ఆమెను కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కోవూరు మండలం కట్టకింద చెర్లోపాలెేనికి చెందిన అబ్బాయి అశోక్, బుచ్చిరెడ్డిపాళెం మండలం జండాదిబ్బకు చెందిన శిరీష.. కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకొని రక్షణ కల్పించాలంటూ కోవూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు.. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడుతుండగా.. యువతి సోదరుడు హరీష్.. యువతిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన శిరీషను చికిత్స నిమిత్తం వెంటనే కోవూరు ఆస్పత్రికి తరలించారు. హరీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి..Bike Hits tractor: ఘోర ప్రమాదం.. అన్నాచెల్లెలు సహా బాలుడు దుర్మరణం