నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లను కౌన్సిలర్లు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. వైకాపాకు చెందిన గోపవరం వెంకటరమణమ్మ ఛైర్పర్సన్గా, షేక్ సర్దార్ వైస్ ఛైర్మన్ ఎన్నుకున్నారు. వారు ప్రమాణం స్వీకారం చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులుండగా.. వైకాపా19, తెదేపా2, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు,జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు.
ఆత్మకూరు మున్సిపల్ ఛైర్మన్గా గోపవరం వెంకటరమణమ్మ - atmakuru municipal chairman latest news
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ ఛైర్పర్సన్గా గోపవరం వెంకటరమణమ్మ, వైస్ ఛైర్మన్గా షేక్ సర్దార్లు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు.

ఆత్మకూరు మున్సిపల్ ఛైర్మన్గా గోపవరం వెంకటరమణమ్మ ఏకగ్రీవం