ప్రతీ రోజు కళ్ళెదుటే భారీ వాహనాల్లో సుదూర ప్రాంతాలకు ఇసుక తరలిపోతుందని, అధికారుల నిర్వహణ పారదర్శకంగా లేదని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మండిపడ్డారు. అప్పారావు పాళెం వద్ద ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక స్టాక్ యార్డును పరిశీలించిన ఆయన సామాన్యులకు దొరకని ఇసుకను, బడా కాంట్రాక్టర్లు, బిల్డర్లకు, వందల టన్నుల్లో కొనుగొలుకు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పందించి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అన్నవరపు శ్రీనివాసులు, కె. సుబ్రహ్మణ్యం, పి. నరేంద్ర, జమ్మల ప్రసాద్, తోట చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
సామాన్యులకు దక్కని ఇసుక.. బిల్డర్లకు ఎలా దొరుకుతుంది? - janasena incharge visited sand stock yard latest news
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో అప్పారావు పాళెం వద్ద ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక స్టాక్ యార్డును ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ పరిశీలించారు. సహజ సంపదైన ఇసుకతో వ్యాపారం చేయటం తగదన్నారు.
ఇసుక స్టాక్ యార్డును పరిశీలించిన జనసేన నేతలు