నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు ఏఎస్ఐ రాజు మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో వాసిలి సమీపానికి వచ్చేసరికి వాహనానికి పంది అడ్డు రావడంతో, దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి బోల్తా పడటంతో రాజు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గుర్తించి స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కారును క్రేన్ సాయంతో తరలించారు. ఘటనలో మృతి చెందిన రాజును, తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న డ్రైవర సీటు బెల్టు పెట్టుకొని ఉండటంతో గాయాలతో బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే ఎస్ఐగా పదోన్నతి పొందిన రాజు ట్రైనింగ్ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్న సమయంలో విషాదం చోటుచేసుకోవటంతో తోటి ఉద్యోగులు, కుటంబీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంది అడ్డం వచ్చింది.. ఏఎస్‌ఐ ప్రాణం పోయింది... - రోడ్డు ప్రమాదంలో ఎఎస్ఐ మృతి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ అధికారిగా ఉన్న రాజు మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
![పంది అడ్డం వచ్చింది.. ఏఎస్‌ఐ ప్రాణం పోయింది...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4285194-640-4285194-1567137346643.jpg)
రోడ్డు ప్రమాదంలో ఎఎస్ఐ మృతి
TAGGED:
రోడ్డు ప్రమాదంలో ఎఎస్ఐ మృతి