శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామాపురం వద్ద ఇద్దరు వ్యక్తులు పక్క జిల్లా నుంచి నాటు సారా తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. సీతారామాపురం మండలానికి చెందిన జయరాములు, రవి అనే ఇద్దరు వ్యక్తులు... ప్రకాశం జిల్లా వి.బైలు గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై 8 లీటర్ల నాటు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ఉదయగిరి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై మహబూబ్ బాషా, సిబ్బందితో కలసి వాహనాలను తనిఖీ చేసే క్రమంలో.. ఈ ఇద్దరినీ సోదా చేశారు. నాటు సారా గుర్తించి ఇద్దరిని అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరుస్తామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.