కరోనాకు ఉచితంగా ఆయుర్వేద మందు ఇస్తున్నారన్న విషయం తెలుసుకుని.. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. 15 రోజుల్లోనే సుమారు 50 వేల మంది ఔషధం కోసం వచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో.. మందు పంపిణీ నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. కానీ ప్రజలు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒత్తిడి మేరకు తిరిగి పంపిణీ చేయాలని నిర్ణయించారు.
వన మూలికలతోనే...
ఆనందయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా అనేక వ్యాధులకు వన మూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొవిడ్ విలయం సృష్టిస్తుండగా.. దానికి సైతం మందు తయారు చెశారు. అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకులు, తెల్లజిల్లేడు, పూల మొగ్గలు, ముళ్ల వంకాయలతో ఔషధం తయారు చేస్తున్నట్లు ఆ వైద్యుడు తెలిపాడు.
ఇదీ చదవండి:తమిళనాడులో తగ్గని కరోనా ఉద్ధృతి