నెల్లూరు జిల్లా కృష్ణపట్నం (krishnapatnam) లో ఆనందయ్య (Anandaiah) మందు తయారీ కేంద్రాన్ని మార్చారు. గ్రామానికి సమీపంలో ఉన్న పోర్టులోని సీవీఆర్ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. తయారీకి అవసరమైన సామగ్రిని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. మందు పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆనందయ్య తెలిపారు. తేదీ ప్రకటించే వరకూ ఎవరూ కృష్ణపట్నం రావద్దని కోరారు.
Anandaiah Medicine: మందు పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తాం: ఆనందయ్య - krishnapatnam anandayya medicine
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మందు పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, ఎవరూ కృష్ణపట్నం రావద్దని ఆనందయ్య కోరారు. తయారీకి అవసరమైన వనమూలికలను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.
![Anandaiah Medicine: మందు పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తాం: ఆనందయ్య anandhayya medicine manufacturing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11988920-778-11988920-1622631877773.jpg)
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ
ముందస్తు చర్యల్లో భాగంగా... మందు పంపిణీ సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు. ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున చెక్‌పోస్ట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మందు తయారీకి అవసరమైన మూలికలు, ఔషధాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని ఆనందయ్య కోరారు.
ఇదీచదవండి.