నెల్లూరు జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ - నెల్లూరు లో పకడ్బందిగా లాక్డౌౌన్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలో ఎవరికి వైరస్ సోకకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
![నెల్లూరు జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ Armored lockdown in Nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6616390-838-6616390-1585716847799.jpg)
నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుంది. నగరంలోని అన్ని ప్రధాన మార్గాలను మూసేసిన పోలీసులు... రాకపోకలను నియంత్రిస్తున్నారు. జిల్లాలో ఎవరికి వైరస్ సోకకుండా చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దుకాణాలన్నీ మూతపడగా... రహదారులు నిర్మానుష్యంగా మారాయి. హోటల్స్ లేకపోవడంతో పలువురు దాతలు నిరాశ్రయులకు ఆహారం అందజేస్తున్నారు. మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.