శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అన్నగారి పాలెం సబ్స్టేషన్ నుంచి లక్ష్మీపురం, పాతూరు వరకు 11 కేవీ విద్యుత్ తీగలు... నాణ్యత కోల్పోయి మరమ్మతులకు గురవుతున్నాయి. ఫలితంగా స్థానికులే కాక... ఆక్వా సాగు చేసిన రైతులూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యుత్ అంతరాయాలతో ఆక్వారంగం సతమతం
కరోనా , లాక్డౌన్తో ఇబ్బందులు పడ్డ ఆక్వా రంగం ప్రస్తుతం విద్యుత్ కష్టాలను ఎదుర్కొంటోంది. తరచూ విద్యుత్ అంతరాయాలతో సాగుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై అధికారులను సంప్రదించినా.. సరైన స్పందన లేదని వాపోతున్నారు.
విద్యుత్ అంతరాయాలతో ఆక్వారంగం సతమతం
విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రొయ్యలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ... వారు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: