Approval Dagadarthi Airport DPR: నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్మించనున్న విమానాశ్రయ పనులకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. సుమారు 1,350 ఎకరాల విస్తీర్ణంలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో (పీపీపీ) విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రతిపాదించింది. ప్రయాణికులు, కార్గో విమానాలను నిర్వహించే విధంగా తయారు చేయించిన ఈ డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించింది. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఏపీఏడీసీఎల్ ఎండీ వీఎన్ భరత్‌రెడ్డి తెలిపారు.
Dagadarthi airport in Nellore district: కార్గో రవాణా కేంద్రంగా దగదర్తిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చెన్నై విమానాశ్రయంలో సరకు రవాణా పరిమితి గరిష్ఠ స్థాయికి చేరింది. దీనికి ప్రత్యామ్నాయంగా దగదర్తిని తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు.