ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రైతాంగ వ్యతిరేక చర్యలు చేపడితే సీఎం కార్యక్రమాలను అడ్డుకుంటాం'

By

Published : Jan 16, 2021, 10:35 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న రైతులను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ దుయ్యబట్టారు. కేంద్రంలో రైతు చట్టాలకు మద్ధతిచ్చిన వైకాపా.. ఇక్కడ వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రైతాంగ వ్యతిరేక చర్యలు చేపడితే ముఖ్యమంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

sailajanath press meet
పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతాంగాన్ని కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు. కమిటీల పేరుతో రైతాంగాన్ని మోసగించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని నెల్లూరులో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన దుయ్యబట్టారు. రైతు పక్షపాతినని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్.. కేంద్రాల్లో మాత్రం వ్యవసాయ చట్టాలకు మద్ధతిచ్చి ఇక్కడ వ్యతిరేకించటంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్తుకు తూట్లు పొడిచినా.. రైతాంగ వ్యతిరేక చర్యలు చేపట్టినా ముఖ్యమంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈనెల 19న విజయవాడలో చేపట్టనున్న కిసాన్ వికాస్ సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: గోపూజ పేరిట సీఎం జగన్ డ్రామాలు ఆడుతున్నారు : వెంకటరమణారెడ్డి

ABOUT THE AUTHOR

...view details