- ప్రధాని మోదీ తల్లి కన్నుమూత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బుధవారమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. తల్లి ఆరోగ్య విషమించడం వల్ల మోదీ హుటాహుటిన దిల్లీ నుంచి గుజరాత్ వెళ్లారు. గంటకు పైగా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆస్పత్రిలోని వైద్యులతో తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు.
- ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత
ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన పీలే ఇకలేడు. అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు.
- నేడు మంగళగిరిలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించనున్న సీజేఐ
ఏపీ జ్యుడీషియల్ అకాడమీని నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్ర న్యాయాధికారుల సమావేశంలోనూ సీజేఐ పాల్గొననున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న ఆయనను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బెజవాడ దుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దర్శించుకున్నారు.
- ముగిసిన సీఎం దిల్లీ పర్యటన.. చివరి రోజు అమిత్‌షాతో భేటీ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానిని, కేంద్ర హోం శాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయినట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
- నౌకను పేల్చేసిన బ్రహ్మోస్ క్షిపణి.. 400 కిలోమీటర్లకు పెరిగిన రేంజ్
శత్రుదేశాలకు సింహ స్వప్నమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత్ మరింత ఆధునీకరించింది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం నాశనం చేసేలా దాన్ని అభివృద్ధి చేసింది. సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్ తన అమ్ములపొదిలో మరో అత్యంత కీలకమైన అస్త్రాన్ని చేర్చుకుంది.
- అరాచక వైసీపీ పాలనను గద్దెదింపే వరకూ పోరాటం ఆగదు: చంద్రబాబు
అరాచక వైసీపీ పాలనను గద్దెదింపే వరకూ తన పోరాటం ఆగదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా కావలిలో నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొన్నారు. కందుకూరు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్న ఆయన కావలిలో ఉన్నంతమంది పోలీసులు కందుకూరులో ఉండుంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకాలపై తీవ్రంగా ధ్వజమెత్తిన చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు.
- పొరపాటుగా అకౌంట్లోకి రూ.1.28కోట్లు.. తిరిగివ్వని భారతీయుడికి జైలు శిక్ష
యూఏఈలో ఉంటున్న ఓ భారతీయుడి బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.కోటికి పైగా జమయ్యాయి. తిరిగి ఇవ్వాలని సదరు సంస్థ నుంచి విజ్ఞప్తి వచ్చినప్పటికీ వాటిని అతడు చెల్లించలేదు. దీంతో అతడిపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో జరిమానాతో శిక్ష విధిస్తున్నట్లు దుబాయ్ క్రిమినల్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
- భూమాత గుండె ఘోష.. 2022లో మానవాళిని అల్లాడించిన విపత్తులు
తుపానులు వణికించాయి. వరదలు అతలాకుతలం చేశాయి. ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేశాయి ఒక్క సీజన్‌కే పరిమితమైన మండే ఎండలు.. ఏడాదంతా ప్రతాపం చూపించాయి మొత్తంగా 2022లో ప్రకృతి కన్నెర్రజేసింది. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వనరులను అరగదీస్తున్న మనుషులకు భూమాత తీవ్రమైన హెచ్చరిక చేసింది. ప్రకృతి వ్యవస్థలకు మానవాళి చేస్తున్న వినాశనానికి ప్రతీకారాన్ని చిన్న శాంపిల్ రూపంలో చూపించింది. పర్యావరణ పరిరక్షణ ఎంత ముఖ్యమో భూతాపం తగ్గకుంటే ఎంతటి అనర్థాలు జరుగుతాయో తెలియజెప్పింది.
- Tollywood 2022: క్రేజ్ పెరిగింది.. రేటు మారింది.. కానీ ఆఖరిలో మాత్రం..
మరో రోజులో 2022 ముగియనుంది. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చిత్రసీమకి కొన్ని విజయాలు దక్కాయి... పరాజయాలూ పలకరించాయి. అలానే దశాబ్దాల పాటు వెండితెరపై కాంతులీనిన పలువురు సినీ దిగ్గజాలు, చిత్ర ప్రముఖులు ఈ ఏడాదే కాలం చేశారు. ఇంకా సినీ ఇండస్ట్రీలో ఏం జరిగాయంటే..
- రామ్‌చరణ్ గడియారాల రేటు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఎప్పుటికప్పుడు ట్రెండీ దుస్తుల్లో స్టైలిష్ లుక్ మెయింటెన్ చేసే రామ్‌చరణ్ అందుకు తగ్గట్టుగానే యాక్సెసరీస్ కూడా ధరిస్తారు. కాగా, ఈ మెగా హీరో వద్ద మంచి కాస్ట్లీ గడియారాల కలెక్షన్ ఉంది. వాటి ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. మరి ఆ వాచ్‌లపై ఓ లుక్కేయండి.