- చంద్రబాబు కందుకూరు సభలో విషాదం.. 8మంది మృతి, తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాబు
నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. బహిరంగ సభ వద్ద తొక్కిసలాట జరగ్గా.. ఇద్దరు మహిళలు సహా 8మంది మృతి చెందారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు..బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు..
- కృష్ణాజిల్లాలో 3.8 కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
విశాఖ ఏజెన్సీ నుండి ఆర్టీసీ బస్సులో 18 కేజీల గంజాయి, 3.800కేజీల లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న గ్యాంగ్ పట్టుబడింది. హనుమాన్ జంక్షన్ పొట్టపాడు టోల్ గేట్ వద్ద నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి కేసు పూర్వాపరాలు తెలిపారు.
- విజయనగరం వైసీపీలో వర్గపోరు..ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల వాగ్వాదం
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలోనే అధికార పార్టీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని.. కార్యక్రమాలపై కనీస సమాచారం కూడా ఇవ్వటం లేదని ఎమ్మెల్సీ వర్గీయులు మంత్రి బొత్స ముందు గగ్గోలు పెట్టారు.
- వీధి దీపాలు వేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: వైసీపీ కౌన్సిలర్
YCP Councilor Angry On YCP Government: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీసం వీధి దీపాలు వేయలేని స్థితిలో ఉందని వైసీపీ కౌన్సిలర్ ఖాసీం బేగ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పింఛన్లు తొలగించడంపై టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
- ట్రాన్స్ఫార్మర్లోని రాగి వైర్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. రోజంతా కరెంట్ కట్
ట్రాన్స్ఫార్మర్లోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు దొంగలు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాజియాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
- టీచర్ల చొరవ... విదేశీ భాషల్లో అలవోకగా మాట్లాడుతున్న విద్యార్థులు
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మోర్షి మున్సిపల్ స్కూల్ విద్యార్థులు విదేశీ భాషల్లో అద్భుతంగా మాట్లాడుతున్నారు. సెల్ఫోన్లతో సమయాన్ని వృథా చేసుకోకుండా.. వాటితోనే విదేశీ భాషలు నేర్చుకున్నారు. ఉపాధ్యాయులు మార్గదర్శకత్వంలో ఆంగ్లంతో పాటు జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, చైనీస్ వంటి భాషలను సులభంగా మాట్లాడుతున్నారు.
- ఇక చైనాకు వెళ్లొచ్చు, రావొచ్చు.. 3 ఏళ్ల తర్వాత ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన డ్రాగన్
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ.. చైనా ప్రయాణ ఆంక్షలను సడలించింది. దాదాపు మూడేళ్ల తర్వాత తన దేశ సరిహద్దులను అంతర్జాతీయ ప్రయాణికులకు తెరిచింది. పాస్‌పోర్టు, వీసా సేవలను వచ్చే నెల 8వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, చైనాను ఇప్పుడు యాంటీ వైరల్ డ్రగ్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఆ దేశవాసులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి భారత్‌వైపు చూస్తున్నారు.
- ముకేశ్@ 20 ఏళ్ల ఇండస్ట్రీ.. రూ.42 వేల కోట్ల నుంచి రూ.17 లక్షల కోట్లకు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వ్యాపార సామ్రాజ్య సారథిగా ముకేశ్ అంబానీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో సంస్థ ఆదాయాలు 17 రెట్లు, లాభాలు 20 రెట్లు పెరగడమే కాకుండా.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అవతరించింది.
- పావులు చూసి.. ఎత్తులు వేసి.. ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో 'చెన్నై' టీనేజర్ సంచలనం
సోదరుడు చదరంగం ఆడుతుంటే.. ఆ తెలుపు, నలుపు గళ్లు.. ఆ పావులు.. ఆ చిన్నారి దృష్టిని ఆకర్షించాయి. ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థులను చిత్తుచేయడాన్ని ఆమె ఇష్టపడింది. నాలుగేళ్ల వయసులో చెస్‌తో ప్రయాణాన్ని మొదలెట్టింది. కట్ చేస్తే.. ఇప్పుడామె ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ కాంస్య విజేత. ర్యాంకుల్లో మెరుగైన క్రీడాకారిణులను ఓడించి.. అంతర్జాతీయ వేదికపై మెరిసిన చెన్నై టీనేజర్. ఆమెనే.. 15 ఏళ్ల సంచలనం సవితశ్రీ.
- 'సక్సెస్' సొగసులెన్ని?.. 2022లో అలరించిన అగ్ర కథానాయికలు వీళ్లే!
చిత్రసీమలో విజయాలున్న కథానాయికలకి తిరుగే ఉండదు. ఇక స్టార్ హోదా కూడా దక్కించుకున్నారంటే అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించే అవకాశాలు వరుస కడతాయి. వాళ్ల కోసం దర్శకనిర్మాతలు చిత్రీకరణలు కూడా వాయిదా వేసుకుంటారు. మార్కెట్‌పై అంతగా ప్రభావం చూపిస్తుంటారు. ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నా పోటీ పెరిగినా.. కొద్దిమంది కథానాయికలు మాత్రం ఇప్పటికీ జోరు చూపిస్తున్నారు. 2022లో వాళ్ల ప్రభావం ఎలా సాగిందో తెలుసుకుందాం.