- ఎయిర్ఇండియా మరో కీలక నిర్ణయం.. 500 విమానాలు కొనుగోలు.. రూ.8200 కోట్ల డీల్!
ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థల నుంచి 500 విమానాలను కొనుగోలు చేయనుందట.
- 'IT రంగంలో భారత్‌తో చైనా ఎప్పటికీ పోటీ పడలేదు!'
భారత ఐటీ రంగంతో చైనా పోటీ పడలేదని ఆ దేశ నిపుణులే స్పష్టం చేస్తున్నారు. ఐటీలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగిన భారత్‌కు ఇప్పటికిప్పుడే డ్రాగన్ పోటీనిచ్చే అవకాశం లేదని ద రైజ్ ఆఫ్ ఇండియన్ ఐటీ పుస్తక రచయిత మైక్ లియూ అన్నారు. అందరూ అనుకున్నట్లు ప్రభుత్వ విధానాలో.. లేక ఆంగ్ల భాషా పరిజ్ఞానమో భారత ఐటీ వృద్ధికి దోహదం చేయలేదన్నారు. చైనా కూడా భారత ఐటీ సంస్థల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించారు.
- 'తెలుగు సాహిత్యం, భాషకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి సిరివెన్నెల'
Sirivennela Seetarama Sastry Samagra Sahitya Book: సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య రెండు, మూడో సంపుటాలను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు హాజరై.. సీతారామ శాస్త్రితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
- వ్యవసాయమంటే ఏంటో తెలియని వ్యక్తి ఆ శాఖకు మంత్రి కాకాణి: సోమిరెడ్డి
TDP Leaders on ysrcp: వైకాపా ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగొలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు. రైతుల పెట్టుబడులు రెట్టింపు అయినప్పటికీ కనీసం మద్దతు ధర సైతం రావడంలేదని ఆవేదనవ్యక్తం చేశారు.
- వాలంటీర్లకు లక్ష్యాలు పెట్టి మరీ.. అనర్హులకు ఓటు హక్కు కల్పిస్తున్నారు: యనమల
TDP leader Yanamala Ramakrishnudu: వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, వాలంటీర్లకు లక్ష్యాలు పెట్టి మరీ అనర్హులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు.. ఐదు, పది, ఇంటర్ చదివిన వారినీ.. ఈ జాబితాలో చేర్చారని విమర్శించారు. వైకాపా అక్రమాలకు సహకరించి అధికారులు బలి కావద్దని హెచ్చరించారు.
- మోదీ ప్రారంభించిన గోవా కొత్త ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు తెలుసా
గోవాలోని మోపాలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేరు పెట్టారు. అసలు ఈ విమానాశ్రయం విశేషాలేంటంటే
- హెయిర్‌కట్ అలా చేసుకున్నాడని తండ్రి మందలింపు.. ఉరేసుకుని కొడుకు ఆత్మహత్య
స్టైలిష్‌గా హెయిర్ కట్ చేసుకున్నాడని తండ్రి మందలించడం వల్ల ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బంగాల్లో జరిగింది. మరోవైపు, ఓ విద్యార్థినికి మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు పాఠశాల ప్రిన్సిపల్. ఈ దారుణం ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది.
- 'మా దేశం తరఫున ఆడు'.. సంజూ శాంసన్‌కు ఐర్లాండ్ ఆఫర్!
Sanju Samson Ireland : యువ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఐర్లాండ్ బోర్డు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ దేశం తరఫున ఆడాలని అతడిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఐర్లాండ్ ఆఫర్‌ను సంజూ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
- అదిరిపోయే డ్రెస్సుల్లో రష్మిక సూపర్ పోజులు చూపు తిప్పుకోనివ్వట్లేదుగా
నాగశౌర్య ఛలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటీ రష్మిక. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. పుష్పలో అల్లు అర్జున్ సరసన నటించి నేషనల్ క్రష్‌గా మారిపోయింది. కానీ తన ఫ్యాన్స్‌కు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఔట్ఫిట్లలో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. ఓ సారి ఆమె వివిధ ఔట్ఫిట్లలో అదిరిపోయే చిత్రాలను చూసేద్దాం రండి.