నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై చమురు ఉండడంతో ఓ బైక్ అదుపుతప్పింది. ఈ ఘటనలో బైక్ వెనక కూర్చున్న మహిళ రోడ్డుపై పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రాక్టర్ ఆ మహిళపై నుంచి వెళ్లిపోయింది.
ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురానిని గోనుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మాతమ్మగా గుర్తించారు. ఆదూరు పల్లి నుండి గొనుపల్లి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.