జిల్లా ఉన్నతాధికారులు ఎన్నికలపై దృష్టి పెట్టడంతో సొసైటీలో ఉన్న ఉద్యోగులు సరిగా పనిచేయటం లేదని, దీంతో మిల్లర్లకు సరైన ధాన్యం రాలేదని నెల్లూరు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు రంగా నాయుడు తెలిపారు. ఇప్పటికే సీఎంఆర్ ధాన్యం లక్ష టన్నుల కొనుగోలు చేసామని ఆయన తెలియజేశారు. ఇప్పుడు వస్తున్న ధాన్యం సరిగ్గా లేదని, దీంతో మిల్లర్లు పూర్తిగా నష్టపోతున్నారని రంగయ్యనాయుడు తెలిపారు. రైతులకు ప్రభుత్వం గోదాముల ఏర్పాటు చేసినప్పుడే మంచిగా ఉంటుందన్నారు. రైతులు దళారుల వల్ల పూర్తిగా నష్టపోతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు అవసరమైన గోదాములు, కల్లాలు ఏర్పాటు చేయాలని కోరారు.
మిల్లర్లకు ధాన్యం సరఫరాలో అధికారులు విఫలం - రంగయ్యనాయుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు , నెల్లూరు
మిల్లర్లకు సరైన ధాన్యం సరఫరా చేయటంలో అధికారులు విఫలమవుతున్నారని నెల్లూరు జిల్లా రైస్ మిలర్ల సంఘం అధ్యక్షులు రంగా నాయుడు ఆరోపించారు. దళారుల వలలో చిక్కుకుని రైతులు నష్టపోతున్నారని... ప్రభుత్వం వారికి అవసరమైన గోదాములు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సరైన ధాన్యం లేక .... నష్టపోతున్న రైస్ మిల్లర్లు