ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు నగరంలో తాత్కాలికంగా లాక్​డౌన్ తరహా నిబంధనలు అమలు - నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాలపాటు, ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూను అమలులోకి తెస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా అధికారులు తగు చర్యలు చేపడుతున్నారు. తాత్కాలికంగా లాక్​డౌన్ తరహా నిబంధనలు అమలు చేస్తున్నట్లు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ వెల్లడించారు.

Nellore
Nellore

By

Published : May 5, 2021, 8:23 AM IST

కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉద్ధృతమవుతుండటంతో బుధవారం నుంచి నెల్లూరు నగరంలో తాత్కాలికంగా లాక్​డౌన్ తరహా నిబంధనలు అమలు చేస్తున్నట్లు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ వెల్లడించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే నగరంలో అన్ని దుకాణాలకు, రాకపోకలకు అనుమతి ఉంటుందని కమిషనర్ తెలిపారు.

12 తర్వాత అత్యవసరమైన వారికి తప్ప, ఎలాంటి రవాణాకు అనుమతి లేదని వెల్లడించారు. మధ్యాహ్నం 12 వరకు కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుదని, ఆ సమయంలోనూ ప్రజలెవ్వరూ గుంపులుగా ఉండకూడదని చెప్పారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బాధితులకు అవసరమైన ఆహారం అందించేందుకు కార్పొరేషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. నగరంలో 35శాతం పాజిటివిటీ రేటు ఉండటంతో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

ABOUT THE AUTHOR

...view details