ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Municipal Polls: ఉద్రిక్తతల మధ్య ముగిసిన 'కుప్పం' ఎన్నికల పోలింగ్‌ - ఏపీ మున్సిపల్​ ఎన్నికల తాజా వార్తలు

ap local body elections
నెల్లూరు నగరపాలక సంస్థకు కొనసాగుతున్న పోలింగ్‌

By

Published : Nov 15, 2021, 9:56 AM IST

Updated : Nov 15, 2021, 8:03 PM IST

19:54 November 15

  • నెల్లూరు నగరపాలికలో సాయంత్రం 5 వరకు 50 శాతం పోలింగ్‌
  • కుప్పం పురపాలికలో 76.48 శాతం పోలింగ్ నమోదు
  • ఆకివీడు నగర పంచాయతీలో 79.74 శాతం పోలింగ్‌
  • దర్శి నగర పంచాయతీలో 76.4 శాతం పోలింగ్‌ నమోదు

19:10 November 15

  • కుప్పం పురపాలక ఎన్నికల్లో 76.48 శాతం పోలింగ్ నమోదు

17:26 November 15

తెదేపా నేతపై దాడి

  • గుంటూరు: దాచేపల్లి హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా నేతపై దాడి
  • ఓటేసేందుకు వచ్చిన తెదేపా నేత తంగెళ్ల శ్రీనివాస్‌పై వైకాపా శ్రేణుల దాడి
  • వెంటనే స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

17:26 November 15

కుప్పంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌

  • కుప్పంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌
  • ఉదయం నుంచీ ఉద్రిక్తతల మధ్య కుప్పం పోలింగ్
  • కుప్పం: ఉదయం నుంచీ భారీగా తరలివచ్చిన స్థానికేతరులు
  • తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణకు కారణమైన స్థానికేతరుల అంశం
  • కుప్పం: పలుచోట్ల స్థానికేతరులను అడ్డుకున్న తెదేపా నాయకులు
  • బస్సుల్లో వచ్చిన స్థానికేతరులను అడ్డుకున్న తెదేపా నేతలు
  • స్థానికేతరులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని తెదేపా నేతల ఆగ్రహం
  • కుప్పం: 16వ వార్డులో రోజంతా ఉద్రిక్త పరిస్థితులు
  • 16వ వార్డులో వైకాపా తరఫున బరిలో ఛైర్మన్‌ అభ్యర్థి సుధీర్‌
  • కుప్పం: 16వ వార్డులోని కళాశాలలో భారీగా స్థానికేతరుల బస
  • కుప్పం: దొంగఓట్లు వేసేందుకే వచ్చారని తెదేపా నేతల ఆగ్రహం
  • కుప్పం: విజయవాణి కళాశాల వద్ద ఆందోళనకు దిగిన తెదేపా నేతలు
  • కుప్పం: ధర్నాకు దిగిన తెదేపా నేతలపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
  • కుప్పంలో పోలింగ్‌ 80 శాతం దాటవచ్చని అధికారుల అంచనా

17:03 November 15

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికలు

  • రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికలు
  • నెల్లూరు నగరపాలిక, 12 పురపాలికల్లో జరిగిన ఎన్నికలు
  • సాయంత్రం 5 వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
  • ఎల్లుండి మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు

16:58 November 15

బుచ్చిరెడ్డిపాలెం పురపాలిక 13 వార్డులో ఉద్రిక్తత

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం పురపాలిక 13 వార్డులో ఉద్రిక్తత
వైకాపా నేతలు దొంగఓట్లు వేయిస్తున్నారని తెదేపా ఆరోపణ

భారీగా మోహరించిన తెదేపా, వైకాపా కార్యకర్తలు; వాగ్వాదం

రెండు పార్టీల నేతలు, కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు

16:56 November 15

వంశీకృష్ణ యాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం

  • పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వైకాపా నేత వంశీకృష్ణ యత్నం
  • వంశీకృష్ణ యాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం
  • తెదేపా, జనసేన కలిసి ఓటర్లను అడ్డుకుంటున్నాయని ఆరోపణ

16:48 November 15

31వ డివిజన్‌ ఉమెన్స్ కాలేజ్‌ వద్ద గందరగోళం

  • విశాఖ: 31వ డివిజన్‌ ఉమెన్స్ కాలేజ్‌ వద్ద గందరగోళం
  • ఎంపీ విజయసాయిరెడ్డి రాకపై తెదేపా, జనసేన అభ్యంతరం
  • ఓటింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నారని అనుమానం: జనసేన

16:15 November 15

తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు అరెస్టు

  • కుప్పంలో తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు అరెస్టు
  • శ్రీనివాసులు అరెస్టుపై పోలీసులను నిలదీసిన తెదేపా శ్రేణులు
  • లాఠీఛార్జ్ చేసి తెదేపా కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు
  • లాఠీఛార్జ్‌లో పలువురు తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలు

15:33 November 15

తెదేపా శ్రేణులపై లాఠీఛార్జ్‌

  • కుప్పం: విజయవాణి కళాశాల వద్ద తెదేపా శ్రేణులపై లాఠీఛార్జ్‌
  • స్థానికేతరులను అరెస్టు చేయాలని తెదేపా శ్రేణుల ఆందోళన
  • లాఠీఛార్జ్‌లో స్పృహ తప్పి పడిన తెదేపా కార్యకర్త, ఆస్పత్రికి తరలింపు

15:20 November 15

  • కుప్పం: విజయవాణి పాఠశాల వద్ద ఉద్రిక్తత
  • విజయవాణి పాఠశాలలో బస చేసిన స్థానికేతరులు
  • దొంగఓట్లు వేసేందుకే వచ్చారని తెదేపా నేతల ఆగ్రహం

14:58 November 15

కమలాపురంలో వైకాపా దొంగ ఓట్లు...

కడప: కమలాపురంలో వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందని తెదేపా ఆరోపణ

కమలాపురం 9వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా ఆరోపణ

మాచిరెడ్డిపల్లి నుంచి ర్యాలీగా వెళ్లిన తెదేపా నేతలు

పుత్తా లక్ష్మిరెడ్డి, చైతన్యరెడ్డిని అడ్డుకున్న పోలీసులు

పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం

ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు

స్థానికేతరులు కమలాపురంలో తిష్ఠవేసినా పట్టించుకోవట్లేదని ఆందోళన

కడప: తెదేపా నేతలను మాత్రం అడ్డుకుంటున్నారని నిరసన

14:58 November 15

దొంగ ఓట్లు వేయించుకునే అలవాటు వైకాపాకు లేదు: సజ్జల

దొంగ ఓట్లు వేయించుకునే అలవాటు వైకాపాకు లేదు: సజ్జల

స్థానికేతరులతో ఎవరు ఓటేయిస్తున్నారో అందరికీ తెలుసు: సజ్జల

మంచి పాలనకు ప్రజలు ఎప్పుడూ మద్దతుగా ఉంటారు: సజ్జల

14:20 November 15

కొనసాగుతున్న పోలింగ్‌

  • నెల్లూరు నగరపాలక సంస్థకు కొనసాగుతున్న పోలింగ్‌
  • మధ్యాహ్నం 2 వరకు 36.91 శాతం పోలింగ్‌ నమోదు

14:19 November 15

తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం..

  • ప్రకాశం: దర్శి 19వ వార్డులో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం
  • వైకాపా వర్గీయులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని తెదేపా వర్గీయుల ఆరోపణ
  • పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

13:22 November 15

భాజపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ..

  • కాకినాడ 9 వ డివిజన్‌లో భాజపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ
    పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా అభ్యర్థి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • ప్రచారాన్ని అడ్డుకున్నామన్న భాజపా నేత మాలకొండయ్య
  • కాకినాడ: ఇరువర్గాల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు

13:21 November 15

కుప్పంలో స్థానికేతరు..

  • కుప్పం: స్థానికేతరులను తరలిస్తుండగా పట్టుకున్న తెదేపా శ్రేణులు
  • కుప్పం: స్థానికేతరులు ప్రయాణిస్తున్న బస్సు పోలీసులకు అప్పగింత
  • దొంగఓట్లు వేసేందుకు వచ్చిన వారిపై చర్యలు లేవని తెదేపా ఆగ్రహం
  • కుప్పం: పోలీసుల వైఖరిని నిరసిస్తూ తెదేపా శ్రేణుల ఆందోళన

13:21 November 15

తెదేపా శ్రేణుల ఆందోళన

  • కుప్పం మున్సిపాలిటీలో కొనసాగుతున్న పోలింగ్
  • కుప్పం పూలమార్కెట్ సమీపంలో తెదేపా శ్రేణుల ఆందోళన
  • పూలమార్కెట్‌ వంతెన నుంచి తెదేపా శ్రేణుల ర్యాలీ
  • కుప్పం: నిరసనకు దిగిన తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

12:35 November 15

రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు

  • రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు
  • తెదేపా అక్రమాలకు పాల్పడుతోందంటూ వైకాపా నేతల ఫిర్యాదు
  • ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
  • కుప్పంలో వారం రోజులుగా తెదేపా అక్రమాలు చేస్తోంది: లేళ్ల అప్పిరెడ్డి
  • కుప్పంలో చంద్రబాబుకు ఓటు లేదు: లేళ్ల అప్పిరెడ్డి
  • చంద్రబాబు కుప్పానికి వెళ్లాల్సిన అవసరమేంటి?: లేళ్ల అప్పిరెడ్డి
  • చంద్రబాబు కుప్పానికి వెళ్లకుండా ఆపాలని కోరాం: లేళ్ల అప్పిరెడ్డి
  • మా ఫిర్యాదుపై ఎస్‌ఈసీ సానుకూలంగా స్పందించారు: లేళ్ల అప్పిరెడ్డి

12:34 November 15

రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు

రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు

తెదేపా అక్రమాలకు పాల్పడుతోందంటూ వైకాపా నేతల ఫిర్యాదు

ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి

11:44 November 15

ఉప ఎన్నికలో ఉద్రిక్తత..

  • విశాఖ 31 వ డివిజన్ ఉప ఎన్నికలో ఉద్రిక్తత
  • పోలింగ్‌ కేంద్రం వద్ జనసేన, వైకాపా శ్రేణుల ఘర్షణ
  • విశాఖ: ఇరు వర్గాలకు సర్దిచెబుతున్న పోలీసులు

11:44 November 15

రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు..

  • విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు
  • వైకాపా అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ ఫిర్యాదు
  • వైకాపా నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. అడ్డుకోవాలని ఫిర్యాదు
  • ఎస్ఈసీ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు
  • ఎస్ఈసీకి అశోక్‌బాబు, బొండా ఉమ, బోడె ప్రసాద్ ఫిర్యాదు

10:58 November 15

కుప్పం 16వ వార్డులో ఉద్రిక్తత..

  • కుప్పం 16వ వార్డులో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు
  • కుప్పం: స్థానికేతరులను గుర్తించి పట్టుకున్న తెదేపా ఏజంట్లు
  • కుప్పం: దొంగ ఓటర్లను పోలీసులకు అప్పగించిన తెదేపా ఏజంట్లు
  • కుప్పం: దొంగ ఓటర్లను పోలీసులు వదిలివేశారని తెదేపా ఆందోళన
  • కుప్పం: తెదేపా కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు

10:52 November 15

వైకాపా అభ్యర్థి ఇంటి ముందు బారులు తీరిన ఓటర్లు..

  • ఏలూరు 45వ డివిజన్ వైకాపా అభ్యర్థి ఇంటి ముందు బారులు తీరిన ఓటర్లు
  • ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేస్తున్నారని తెదేపా నాయకుల ఆరోపణ
  • ఏలూరు: వైకాపా అభ్యర్థి ఇంటి నుంచి ఓటర్లను పంపిస్తున్న పోలీసులు

10:13 November 15

తెదేపా, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం..

  • కాకినాడ నగర పాలక సంస్థలోని 4 డివిజన్లకు పోలింగ్‌
  • కాకినాడ: 3, 9, 16, 30 డివిజన్లలో కొనసాగుతున్న పోలింగ్‌
  • 16వ డివిజన్‌లోని 1, 2 కేంద్రాల వద్ద తెదేపా నాయకుల ఆందోళన
  • దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలువురిని పట్టుకున్న తెదేపా నాయకులు
  • వైకాపా, తెదేపా నాయకుల మధ్య వాగ్వాదం, సర్దిచెబుతున్న పోలీసులు

09:59 November 15

'ప్రలోభాలకు గురిచేస్తున్నారు..'

  • గుంటూరు నగరపాలక సంస్థ 6వ డివిజన్‌లో ఉప ఎన్నికలు
  • 3 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • వైకాపా నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెదేపా నేతల ఆరోపణ
  • ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని తెదేపా నేతల డిమాండ్

09:49 November 15

నెల్లూరు నగరపాలక సంస్థకు కొనసాగుతున్న పోలింగ్‌

  • నెల్లూరు నగరపాలక సంస్థకు కొనసాగుతున్న పోలింగ్‌
  • ఉదయం 9 గంటల వరకు 5.86 శాతం పోలింగ్‌ నమోదు
  • నెల్లూరు: వెబ్‌ కాస్టింగ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, కమిషనర్‌
  • 35వ డివిజన్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

09:49 November 15

నేతల మధ్య వాగ్వాదం..

  • అనంతపురం: పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికకు పోలింగ్‌
  • పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్‌ యత్నం
  • ఎంపీ మాధవ్‌ వెళ్లడాన్ని వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే పార్థసారధి
  • పెనుకొండ: ఇరువురి మధ్య వాగ్వాదం, సర్దిచెబుతున్న పోలీసులు
  • పెనుకొండ నగర పంచాయతీలో ఉ. 9 వరకు 16 శాతం పోలింగ్‌

09:48 November 15

  • కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డుల్లో పోలింగ్‌
  • కుప్పం మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో ఒక వార్డు ఏకగ్రీవం
  • కుప్పం మున్సిపల్‌ పరిధిలో 48 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • 9 సమస్యాత్మక, మరో 9 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు

09:48 November 15

  • కమతమూరులో దొంగ ఓట్లు వేసేందుకు యత్నం, అడ్డుకున్న స్థానికులు

09:48 November 15

పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత

  • కుప్పం: కొత్తపేట జూనియర్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత
  • ఓటర్లు కానివారికి స్లిప్పులు ఇస్తున్నారంటూ తెదేపా నిరసన
  • కుప్పం: కొత్తపేటలో ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

09:47 November 15

గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో పోలింగ్

  • గుంటూరు: గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో పోలింగ్
  • గుంటూరు: పల్నాడులో 2 వేలమందితో పటిష్ట పోలీసు బందోబస్తు
  • గుంటూరు 6వ వార్డు, రేపల్లె 8వ వార్డులోనూ ఉపఎన్నికలు

09:47 November 15

  • కుప్పం, దాచేపల్లి, గురజాల, దర్శి మున్సిపాలిటీల్లో పోలింగ్‌
  • ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో పోలింగ్‌
  • బుచ్చిరెడ్డిపాలెం, కమలాపురం మున్సిపాలిటీల్లో పోలింగ్‌
  • బేతంచర్ల, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీల్లో పోలింగ్‌
  • ఎల్లుండి పురపాలక, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు

09:47 November 15

ఇబ్బందిపెడుతున్న వర్షం..

  • నెల్లూరులో వర్షం కారణంగా ఇబ్బందిపడుతున్న ఓటర్లు
  • నెల్లూరు: వర్షంతో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోలేకపోతున్న ఓటర్లు
  • నెల్లూరు: వర్షానికి తడిసిన అధికారులు ఏర్పాటుచేసిన టెంట్లు

09:45 November 15

Municipal Polls updates

కొనసాగుతున్న ‘పుర’ పోలింగ్‌
  • నేడు నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీల్లో పోలింగ్
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌
  • నేడు కుప్పం, దాచేపల్లి, గురజాల, దర్శి మున్సిపాలిటీల్లో పోలింగ్‌
  • నేడు ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో పోలింగ్‌
  • నేడు బుచ్చిరెడ్డిపాలెం, కమలాపురం మున్సిపాలిటీల్లో పోలింగ్‌
  • నేడు బేతంచర్ల, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీల్లో పోలింగ్‌
  • ఈ నెల 17న పురపాలక, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు
Last Updated : Nov 15, 2021, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details