నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సుబేదారిపేటలోని రోమన్ క్యాథలిక్ మిషనరీ చర్చిలో నిర్వహించిన ప్రార్థనల్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ పాల్గొన్నారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బిషప్ ఎండీ ప్రకాశం.. బాలయేసును ప్రతిష్ఠించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో వేడుకగా క్రీస్తు జన్మదిన ఉత్సవాలు... - మంత్రి అనిల్ తాజా వార్తలు
క్రిస్మస్ సందర్భంగా నెల్లూరుజిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. సుబేదారిపేటలోని రోమన్ క్యాథలిక్ మిషనరీ చర్చి ప్రార్థనల్లో మంత్రి అనిల్ కుమార్ పాల్గొన్నారు.

నెల్లూరులోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్
బోసుబొమ్మ, వీఆర్సీ సెంటర్, ఫత్తేఖాన్ పేట, బట్వాడిపాలెంలో చర్చీల్లో నిర్వహించిన ప్రార్థనల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్, దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.