రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఎన్నిక జరగకుండా ఉండిపోయిన.. 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. పోలింగ్, లెక్కింపు సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
POLLING CLOSE: ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్ - ఏపీ తాజా రాజకీయ వార్తలు
స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా... మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.
![POLLING CLOSE: ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్ ap-local-body-elections-polling-started-at-7-am](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13628077-thumbnail-3x2-pollll.jpg)
ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్..!
సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మరో 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:AP Local Body Elections: ఆ స్థానాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు నేడే పోలింగ్
Last Updated : Nov 14, 2021, 1:36 PM IST