ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమ్యూనిటీ హాల్ లో గ్రామ సచివాలయం.. కౌంటర్ దాఖలుకు ఆదేశం - ap high court on nellore grama sachivalayam issue

షెడ్యూల్ కులానికి చెందిన కమ్యూనిటీ హాల్ లో గ్రామ సచివాలయాన్ని నిర్వహిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

nellore grama sachivalayam issue
nellore grama sachivalayam issue

By

Published : Dec 1, 2020, 5:57 PM IST

నెల్లూరు జిల్లా కబడిపాలెంలో షెడ్యూల్ కులానికి కమ్యూనిటీ హాల్ లో గ్రామసచివాలయం నిర్వహిస్తున్నారంటూ ప్రశాంత్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై పై ధర్మాసనం విచారణ జరిపింది . షెడ్యూల్ కులానికి చెందిన స్థలంలో సమావేశాలు ,పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది కానీ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఉండదని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. దీని పై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details