నేరడి బ్యారేజీకి సంబంధించి వంశధార జల వివాదాల ట్రైబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం, ముంపు, రిటైనింగ్‌వాల్, ఇతర నిర్మాణాలకు అవసరమైన 106 ఎకరాలను ఒడిశా ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలని వీడబ్ల్యూడీటీ ఈ ఏడాది జూన్ 21న తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఒడిశా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నిర్మాణానికి సంబంధించి గతంలో ఒడిశా లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశామని అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
వంశధారపై ఒడిశా పిటిషన్ కొట్టేయండి..సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్ - వంశధార నీటి వివాదం తాజా వార్తలు
నేరడి బ్యారేజీకి సంబంధించి వంశధార జల వివాదాల ట్రైబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
ap government
ట్రైబ్యునల్ అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే తుది తీర్పును వెలువరించినందున ఒడిశా పిటిషన్ విచారణ అర్హమైనది కాదని తెలిపింది. అందువల్ల ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో విన్నవించింది.
ఇదీ చదవండి: