నేడు రాష్ట్రంలో జరిగిన నేరాలు.. ఘోరాలు AP Crime News: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని గౌరవరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెంది ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నెల్లూరు జిల్లాలోని కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మోక్షగుండం సురేష్ బాబు, భార్య అనుపమ, అనంతరాజు లక్ష్మీనారాయణ, భార్య ఆదిలక్ష్మి, బంధువైన నాగమణిలు కారులో మాలకొండ దైవదర్శనానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. గౌరవరం జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు కూర్చొని ఉన్న లక్ష్మీనారాయణ, డ్రైవింగ్ చేస్తున్న సురేష్ బాబులు మృతి చెందారు.
26 దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్:26 చోరీలకు పాల్పడిన కేసులో ముద్దాయిని కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ జాషువా తెలిపిన వివరాల ప్రకారం పోలీసు సిబ్బంది టీంలుగా ఏర్పడి దర్యాప్తు చేసి సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో నిన్న ముద్దాయిని అరెస్ట్ చేశారు. సొమ్మును రికవరీ చేశారు. ముద్దాయి వద్ద నుంచి సుమారు రెండు లక్షల 14 వేల విలువచేసే వెండి బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ జయ సూర్య తెలిపారు. కంకిపాడులో నివాసం ఉంటున్న ఈవో శివకుమార్ ఇంట్లో ఈ నెల 16న చోరీ జరిగింది. ఈ కేసులో పోలీసులు చెరుకుమల్లి విశ్వనాధ రఘురాం, అలియాస్ కోటేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరులో బ్యాంకు వద్ద మూడు లక్షల రూపాయల చోరీకి కూడా ఇతనే పాల్పడ్డాడని, ముద్దాయిని రిమాండ్‌కి తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.
గంజాయి స్వాధీనం:ఏలూరు జిల్లాలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని ఏలూరు టుటౌన్ పోలీసులు అరెస్టు చేసి లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు టుటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. తంగళ్ళమూడి జంగారెడ్డిగూడెం రోడ్డులో తనిఖీలు చేస్తుండగా ఏలూరుకు చెందిన రాగి నాగేశ్వరరావు, గేదెల సతీష్ కలిసి సుజుకి అక్సెస్ బండిపై ఒక మూటలో గంజాయిని తరలిస్తున్నారు. వారిని అపేందుకు యత్నించగా బోగా గేదెల సతీష్ బండి మీద నుంచి దూకి పారిపోయాడు. లాగి నాగేశ్వరరావు గంజాయితో సహా పట్టుబడ్డాడు. వీఆర్వోల సమక్షంలో ఆ మూటను పరిశీలించగా గంజాయి 12 ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఒక్కో ప్యాకెట్ రెండు కిలోల బరువు కలిగి ఉన్నాయని, వాటి విలువ రూ. 2,40,000 ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలిద్దరూ అన్నదమ్ములని, వీరిద్దరూ ఏలూరు తంగెళ్ళమూడిలో నీలిమందు వ్యాపారంచేస్తూ దానితోపాటు గుట్కా వ్యాపారం చేసేవారని తెలిపారు. ఈ కేసులో ముద్దాయిని పట్టుకున్న సీఐ చంద్రశేఖర్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
రేసుకుక్కల దాడిలో 4 దుప్పులు మృతి :వైెెఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం ఎస్. రాజంపేట ఎస్సీ కాలనీ శివారు ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో శివారెడ్డి పొలం వద్ద రేసుకుక్కల దాడిలో 4 పొడ దుప్పులు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న సిద్దవటం అటవీక్షేత్రాధికారి ప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. తెల్లవారుజామున పొడదుప్పులను రేసుకుక్కల మంద తరుముకుంటూ వచ్చి దాడి చేయడంతో ఒక ఆడ జింక దాని మూడు పిల్లలు తీవ్ర గాయాలతో మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన పొడదుప్పులను సిద్దవటం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఉన్నత అధికారుల ఆదేశాలమేరకు సిద్దవటం పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. వాటిని సాహెబ్ బావి బేస్ క్యాంపు వద్ద ఖననం చేస్తామని సిద్దవటం అటవీ క్షేత్రాధికారి ప్రసాద్ వెల్లడించారు.
ఇవీ చదవండి: