సోదాల్లో కోట్ల ఆస్తులను అనిశా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ధనలక్ష్మీపురంలోని ప్రధాన సూత్రధారి శివకుమార్ ఇంట్లో విలువైన ఆస్తులు, ఇటీవలే కొన్న స్థిరచరాస్తులను గుర్తించారు. ఎనిమిదికిపైగా సేల్ డీడ్‌లు, బంగారు ఆభరణాలు ఇందులో ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజరు శర్మ ఇంట్లో ఇప్పటివరకు 3 లక్షల 60 వేలు, 170 గ్రాముల బంగారు ఆభరణాలు, కృష్ణాజిల్లా నున్నలో కొన్న ఆస్తుల పత్రాలను గుర్తించారు. సీహెచ్ రాజు, కోవూరు మండలంలో చేజర్ల దయాకర్ ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో సీజ్‌చేశారు.
పౌరసరఫరా శాఖలో కుంభకోణంపై అనిశా దాడులు.. ఎవరెవరు ఎంత దోచుకున్నారో!! - ఏపీ రాజకీయ వార్తలు
scam in Civil Supplies Department: నెల్లూరు జిల్లా పౌరసరఫరాల సంస్థలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. అనిశా అధికారులు బుధవారం ఏకకాలంలో దాదాపు 10 ప్రాంతాల్లోని పౌరసరఫరాల సిబ్బంది నివాసాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. అవినీతికి పాల్పడిన సూత్రధారులపై చర్యలకు అనిశా సిద్ధమవుతోంది.
scam in Civil Supplies
రంగనాయకులపేటలోని అరుణకుమార్ ఇంట్లో తనిఖీ చేసి.. శివకుమార్ బహుమతిగా ఇచ్చిన 1.55 లక్షల విలువ చేసే టీవీని సీజ్ చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు నిర్విరామంగా ఈ సోదాలు జరిగాయి. వీరితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులు, సిబ్బందిని సైతం అనిశా అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
Last Updated : Nov 10, 2022, 6:36 AM IST