పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో శాఖ బాధ్యతలను కూడా అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖను కూడా గౌతమ్ రెడ్డికి అప్పగించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి గౌతమ్ రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖల బాధ్యతలతో పాటు నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖల బాధ్యతలు పర్యవేక్షించనున్నారు.
మంత్రి గౌతంరెడ్డికి మరో కీలక శాఖ బాధ్యతలు - మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో శాఖ
సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో శాఖ బాధ్యతలను అప్పగించారు. తన వద్ద ఉన్న మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖను గౌతమ్ రెడ్డికి ఇచ్చారు.
minister gowtham reddy