ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాయుడుపేటలో మరొకరికి కరోనా పాజిటివ్​

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంపై అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నాయుడుపేట నుంచి దిల్లీ వెళ్లొచ్చిన 21 మందితో పాటుగా మరో 15 మందిని క్వారంటైన్​ సెంటర్​లో ఉంచారు.

నాయుడుపేటలో మరో కరోనా పాజిటివ్​ కేసు
నాయుడుపేటలో మరో కరోనా పాజిటివ్​ కేసు

By

Published : Apr 3, 2020, 12:19 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పట్టణంలో పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక బీడీ కాలనీ వాసికి పాజిటివ్ తేలగా.. నెల్లూరులో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే నాయుడుపేట నుంచి దిల్లీ వెళ్లొచ్చిన 21 మందితో పాటుగా 15మందిని క్వారంటైన్​ సెంటర్​లో ఉంచారు. పట్టణంలో మరో కరోనా పాజిటివ్ అని తెలుసుకున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details