ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెన్నా వరదల్లో.. కొట్టుకొచ్చిన వింత జంతువు మృతదేహం - animal swept away in the floods in penna latest news

నెల్లూరు జిల్లా పెన్నా వరదల్లో వింత మృతదేహం కొట్టుకొచ్చింది. నెల్లూరు నగరం భగవత్‌సింగ్‌ కాలనీ వద్ద జంతువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అటవీ, పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు.

Pennalo
Pennalo

By

Published : Dec 1, 2020, 1:26 PM IST

నెల్లూరు పెన్నా తీరంలో వింత జంతువు మృతదేహం కొట్టుకువచ్చింది. భారీ వరదలకు ప్రమాదవశాత్తు నదిలో పడి కొట్టుకువచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అది పులి మృతదేహం అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

నగరంలోని కొత్త బ్రిడ్జి సమీపంలో పడిఉన్న జంతువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details