ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణం మూసేయాలంటూ యువకుల ఆందోళన - అనంతసాగరంలో మద్యం దుకాణం మూసేయాలని ధర్నా

కరోనా బారి నుంచి తమ గ్రామాన్ని కాపాడాలంటూ అనంతసాగరం యువకులు మద్యం దుకాణాల వద్ద ధర్నా చేశారు. పక్క మండలాల్లో ఉన్న ప్రజలు తమ ఊరిలో ఉన్న మద్యం దుకాణాలకు వస్తున్నారంటూ వాపోయారు.

ananthasagaram people protest at wine shops due to corona virus effect
మద్యం దుకాణాల వద్ద యువకులు ఆందోళన

By

Published : Jul 19, 2020, 7:37 PM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మద్యం షాపు ఎదుట స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. కరోనా ప్రభావం వల్ల పక్క మండలాల్లో మద్యం దుకాణాలు మూసేయగా.... వారంతా తమ ఊరి మద్యం షాపునకు వస్తున్నారంటూ వాపోయారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని మూసేయాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details