ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Anandaiah medicine: తొలుత సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ - సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ వార్తలు

anandayya medicine: సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ
anandayya medicine: సర్వేపల్లి వాసులకు ఆనందయ్య మందు పంపిణీ

By

Published : Jun 6, 2021, 1:14 PM IST

Updated : Jun 7, 2021, 2:19 AM IST

13:12 June 06

ఆనందయ్య ఔషధం పంపిణీ నేటి నుంచీ మళ్లీ ప్రారంభంకానుంది. ముందుగా తన సొంత నియోజకవర్గంలో పంపిణీ పూర్తిచేసి... ప్రతి జిల్లాలోనూ పంపిణీకి త్వరిగతగతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆనందయ్య తెలిపారు. ప్రతి జిల్లాలోనూ కరోనాతో బాధపడుతున్నవారిని గుర్తించి ప్రభుత్వ సహకారంతో వారికి ముందుగా మందు ఇస్తామని చెబుతున్నారు. ఔషధం కోసం కృష్ణపట్నం ఎవరూ రావొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.

నేటితో తెరపడనుంది

ఆనందయ్య ఔషధంతో కరోనా తగ్గుతుందని, రాదని నమ్మేవాళ్ల ఎదురుచూపులకు నేటితో తెరపడనుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత ఎప్పుడెప్పుడు పంపిణీ ప్రారంభం అవుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. సోమవారం నుంచే పంపిణీ పునఃప్రారంభిస్తున్నట్లు ఆనందయ్య తెలిపారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన సర్వేపల్లిలో పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది పూర్తయ్యాక అన్ని జిల్లాల్లోనూ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముందుగా ప్రభుత్వ సహకారంతో అన్ని జిల్లాల్లోని కరోనా బాధితులను గుర్తించి...ఔషధం ఇవ్వాలని యోచన చేస్తున్నామని ఆనందయ్య తెలిపారు.

కృష్ణపట్నం రావొద్దు

నేటి నుంచీ పంపిణీ ప్రారంభంకానుందనే విషయం తెలుసుకున్న చాలా మంది కృష్ణపట్నానికి చేరుకోవటంపై ఆనందయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర జిల్లాల వాళ్లెవరూ ఔషధం కోసం కృష్ణపట్నం రావొద్దని కోరారు. ఇక్కడకు వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతిఒక్కరూ తనకు సహకరించాలని కోరారు.

జిల్లాల్లో ఔషధం పంపిణీపై ఆనందయ్య, అధికారులు మరింత స్పష్టత ఇవ్వాలని మందు కోసం ఎదురుచూస్తున్నవాళ్లు కోరారు.

ఇదీ చదవండి:

నా ఫోన్‌తో తప్పుడు సందేశాలు: ఎంపీ రఘురామ

Last Updated : Jun 7, 2021, 2:19 AM IST

ABOUT THE AUTHOR

...view details