నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలించారు. తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో తీసుకెళ్లారు. ఆనందయ్య మందు కోసం.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నం వస్తున్నారు. ఆనందయ్య కోసం వస్తున్న వారికి పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్ ఉంది.
రహస్య ప్రాంతానికి ఆనందయ్య.. మందుపై నివేదికలు వచ్చేవరకు అంతేనా? - కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం వార్తలు
08:27 May 29
రోజుకో ట్విస్ట్
ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. తుది నిర్ణయం తీసుకునే వరకు రహస్య ప్రాంతంలోనే ఆనందయ్యను ఉంచనున్నారు.
నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని కృష్ణపట్నంలోకి పోలీసులు అనుమతించట్లేదు.
ఇదీ చదవండి:Hanuman birth place: 'కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడు'.. 'కాదు..తిరుగిరుల్లోని అంజనాద్రిలోనే'