ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

anandaiah: ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదు : ఆనందయ్య - ఆనందయ్య తాజా సమాచారం

ఆయుర్వేద మందు తయారీకి అవసరమైన మూలికలు లభ్యమవుతున్నా తగినంత యంత్రాంగం, ప్రభుత్వం నుంచి సహకారం లేదన్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసిన స్పందించలేదని ఆనందయ్య తెలిపారు తాను పంపిణీ చేస్తున్న మందును విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

anandaiah
anandaiah

By

Published : Jun 24, 2021, 8:44 AM IST

Updated : Jun 24, 2021, 12:16 PM IST

ఆయుర్వేద మందు తయారీకి అవసరమైన మూలికలు లభ్యమవుతున్నా.. తగినంత యంత్రాంగం, ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేక పూర్తిస్థాయిలో కరోనా నివారణ మందును ప్రజలకు చేరువ చేయలేకపోతున్నామని ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘ఈ విషయంలో ప్రభుత్వానికి లేఖ రాసినా పెద్దగా స్పందన లేదు. ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో పార్టీలకు అతీతంగా వివిధ జిల్లాల్లో ప్రజలకు మందు ఇస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో బడ్డీ బంకుల్లో మా మందు విక్రయించడం దారుణం. నేను ఉచితంగా పంపిణీ చేస్తున్న దానిని విక్రయిస్తున్నారంటే అది ప్రభుత్వ లోపం. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి : ఆనందయ్య ,ఆయుర్వేద నిపుణుడు

ఇదీ చదవండి

నాణెం రూ.125... కానీ ఖరీదు రూ.3,200

Last Updated : Jun 24, 2021, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details