నెల్లూరు జిల్లా గొలగమూడిలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం పంపిణీ ప్రారంభమైంది. శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం వద్ద ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ ఇవాళ లాంఛనంగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ పూర్తి చేసిన అనంతరం..జిల్లావ్యాప్తంగా ఔషదం ఇస్తామని కాకాణి పునరుద్ఘాటించారు. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్నవాళ్లకు ఉచితంగా మందు ఇవ్వాలని యోచిస్తున్నామని.. ప్రభుత్వ సహకారంతోనే అది సాధ్యమౌతుందని ఆనందయ్య చెప్పారు. ఆదేశాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా..మౌలిక సదుపాయాలు సమకూర్చుకోకపోవటం వల్లనే తయారీ ఆలస్యమవుతోందోని వెల్లడించారు.
చంద్రగిరిలోనూ..
మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకూ ఈ ఔషధం అందుబాటులోకి రానుంది. ఆనందయ్య ఔషధాల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రివెంటెవ్ మెడిసిన్ "పీ" తయారీని..చంద్రగిరి మండలం ముక్కోటి తీర్థంలో ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఔషధం తయారీ కోసం నియోజకవర్గంలోని ఆరు మండలాల అటవీ ప్రాంతాల నుంచి స్థానిక ప్రజలే ఆరు రకాల వనమూలికలు సిద్ధం చేయగా..కృష్ణపట్నం నుంచి ఆనందయ్య మరో పదిరకాల ముడిపదార్థాలను పంపించారు. మొత్తం 16 రకాల ఔషధాలతో మందు తయారీ చేస్తున్నారు. ఆనందయ్య ఔషధంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని గౌరవించి..కరోనా నివారణకు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ప్రివెంటివ్ మెడిసిన్ మాత్రమే తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో లక్షా 60 వేల కుటుంబాలకు మందు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్, ఆయన శిష్యబృందం కలిసి ఔషధాన్ని తయారుచేస్తున్నారు.
కొరవడిన మౌలిక సదుపాయాలు