నెల్లూరు జిల్లా గొలగమూడిలో కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేస్తామని కాకాణి స్పష్టం చేశారు. గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం వద్ద మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయుర్వేద మందును అందజేసిన తర్వాతే ఇతరులకు పంపుతామని కాకాణి తెలిపారు. దేశవ్యాప్తంగా ఆనందయ్య ఆయుర్వేద మందును అందించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.